News August 18, 2024
VZM: టీచర్ల మృతి.. రూ.4 కోట్లతో బ్రిడ్జి

ఉమ్మడి విజయనగరం జిల్లా పాచిపెంట(M) సరాయివలస సమీపంలోని రాయిమాను కొండవాగులో ఇద్దరు టీచర్లు మృతిచెందిన విషయం తెలిసిందే. హరియాణాకు చెందిన టీచర్లు మహేశ్, ఆర్తి మృతదేహాలు స్వగ్రామం చేరే వరకు పూర్తి ఖర్చులు భరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు పరిహారంతో పాటు ఉద్యోగం ఇస్తామని పేర్కొంది. వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.4 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి సంధ్యారాణి ప్రకటించారు.
Similar News
News February 6, 2025
VZM: ‘క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి’

క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారిణి జీవన రాణి సూచించారు. వైద్య శాఖ కార్యాలయంలో జిల్లాలో పీహెచ్సీ, సీహెచ్సీ వైద్యులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మాతృ సేవలు, జేఎస్ వై, పీఎం మాతృ సురక్ష అభియాన్, తదితర కార్యక్రమాలపై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శత శాతం ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందికి సూచించారు.
News February 6, 2025
మంత్రి కొండపల్లికి మూడో ర్యాంక్

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మూడో ర్యాంకు పొందారు.
News February 6, 2025
ఈనెల 10న డీ వార్మింగ్ డే: కలెక్టర్ అంబేడ్కర్

విజయనగరం జిల్లాలో గుర్ల మండలంలో తప్ప జిల్లా అంతటా ఈ నెల 10న డీ వార్మింగ్ డే సందర్భంగా అల్బెండజోల్ మాత్రలను సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష జరిపారు. గుర్ల మండలంలో బోదకాలుకు సంబంధించిన మాత్రలు వేస్తున్నందున నులిపురుగుల నివారణా మాత్రలు ప్రస్తుతం వేయడం లేదని తెలిపారు. 19 ఏళ్లలోపు ఉన్న వాళ్లంతా అల్పెండజోల్ మాత్రలు వేసుకోవాన్నారు.