News October 16, 2024
VZM: డయేరియా మరణాలపై సీఎం ఆరా

గుర్లలో డయేరియాతో ఐదుగురు మృతి చెందడంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారన్న సమాచారంపై సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న చికిత్స, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 27, 2025
గంజాయి కేసులో ఐదుగురికి జైలు శిక్ష: VZM SP

డ్రగ్స్ కేసులో ఐదుగురు నిందితులకు 18 నెలల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి మీనాదేవి గురువారం తీర్పు వెలువరించారని విజయనగరం ఎస్పీ దామోదర్ తెలిపారు. విజయనగరంలోని వన్ టౌన్ పోలీస్స్టేషన్లో జూలై 26, 2024న పాత రైల్వే క్వార్టర్స్ వద్ద 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను సమర్పించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.
News November 27, 2025
VZM: బొత్స భద్రత లోపంపై విచారణకు ఆదేశం

పైడితల్లి సిరిమానోత్సవంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు కేటాయించిన వేదిక కూలిన ఘటనపై విచారణకు GAD ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా కలెక్టర్ను ఆదేశించారు. బొత్స ప్రొటోకాల్, భద్రతా లోపంపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని ఆదేశిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వేదిక కూలిన ఘటనలో MLC సురేష్ బాబు, ఎస్సై, మరో బాలికకు గాయాలైన సంగతి తెలిసిందే.
News November 26, 2025
ఐదుగురికి జరిమానా.. మరో ఐదుగురికి జైలు శిక్ష: VZM ఎస్పీ

విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిలో రూరల్ & గంట్యాడ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మంది వ్యక్తులు బుధవారం పట్టుబడ్డారు. పట్టుబడ్డ నిందితులను విజయనగరం ఎక్సైజ్ కోర్టులో హాజరుపర్చగా, 5 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, మరో 5 మందికి 5 రోజుల జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ శ్రీవిద్య తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ తెలిపారు.


