News October 22, 2024
VZM: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షకు సంబంధించి ఉచిత భోజన, వసతితో పాటు మూడు నెలల శిక్షణకు దరఖాస్తుల గడువు పెంచినట్లు సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ జిల్లా ఉపసంచాలకుడు బి.రామానందం తెలిపారు. ఈ నెల 25 వరకు దరఖాస్తుల నమోదుకు గడువు పెంచామని అర్హత గల అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు. https://jnanabhumi.ap.gov.in ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 8, 2025
జాతీయస్థాయి పోటీలకు కొత్తవలస విద్యార్థిని

డిసెంబర్లో జరగనున్న జాతీయస్థాయి అండర్-19 మహిళా క్రికెట్ పోటీలకు కొత్తవలస ZPHS విద్యార్థిని పుష్పిత గౌడ కుమార్ ఎంపికైనట్లు HM ఈశ్వరరావు తెలిపారు. గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా జట్టు తరుఫున ఆడి 3వ స్థానం సాధించింది. దీంతో ఏపీ రాష్ట్ర మహిళా క్రికెట్ టీమ్కు వైస్ కెప్టెన్గా ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చినట్లు పీడీ బంగారు పాప తెలిపారు.
News November 8, 2025
మండలానికి 500 ఎకరాల్లో ఉద్యాన పంటలు: VZM కలెక్టర్

కూరగాయల పెంపకంపై దృష్టి పెట్టాలని, రైతులకు సుస్థిర లాభం వచ్చేలా కృషి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. ఉద్యాన, పశు సంవర్ధక, అటవీ, ఏపీఎంఐపీ శాఖలపై శుక్రవారం సమీక్ష జరిపారు. మండలానికి కనీసం 500 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి జరగాలన్నారు. స్థానిక మార్కెట్ డిమాండ్ మేరకు కూరగాయలు, పూల తోటలు, అరటి, బొప్పాయి, పుట్టగొడుగు సాగు పెంచాలని సూచించారు.
News November 7, 2025
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

గరివిడి మండలం చిన ఐతంవలస వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో చీపురుపల్లి మండలం పెరుమాళికి చెందిన కొరగంజి శ్రీలత (48)మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భర్త సంగం నాయుడుతో కలిసి స్కూటీపై చీపురుపల్లి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.ఈ దుర్ఘటనలో బస్సు ముందు చక్రం శ్రీలత తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా నాయుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు.


