News October 22, 2024

VZM: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు

image

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షకు సంబంధించి ఉచిత భోజన, వసతితో పాటు మూడు నెలల శిక్షణకు దరఖాస్తుల గడువు పెంచినట్లు సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ జిల్లా ఉపసంచాలకుడు బి.రామానందం తెలిపారు. ఈ నెల 25 వరకు దరఖాస్తుల నమోదుకు గడువు పెంచామని అర్హత గల అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు. https://jnanabhumi.ap.gov.in ఆన్‌లైన్ పోర్టల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

Similar News

News November 13, 2024

డ్రగ్స్ నియంత్రణ ఛాలెంజ్‌గా మారింది: SP

image

డ్రగ్స్ నియంత్రణ సమాజానికి పెద్ద ఛాలెంజ్‌గా మారిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. మానవ జీవితాలను మాదకద్రవ్యాలు ఏ విధంగా నాశనం చేస్తాయో వైద్య విద్యార్థులకు తెలియదని అన్నారు. అరెస్టులు కంటే అవగాహనతోనే నిర్మూలించవచ్చునని భావించి యువతలో చైతన్యం తీసుకువస్తున్నామని చెప్పారు. కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయని వివరించారు.

News November 12, 2024

శాసనసభ విప్‌గా కురుపాం ఎమ్మెల్యే 

image

కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అసెంబ్లీ విప్‌గా నియమితులయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెను శాసనసభ విప్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల్లో జగదీశ్వరీకే విప్‌గా పనిచేసే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ కూటమి శ్రేణులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.