News May 24, 2024

VZM: తహశీల్దార్ హత్య కేసులో నిందితుడికి బెయిల్

image

విశాఖ రూరల్ తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడికి విశాఖ జిల్లా కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. మూడు నెలల తర్వాత నిందితుడికి ఊరట లభించింది. కోర్టు షరతుల ప్రకారం బెయిల్ మంజూరు చేసింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

Similar News

News October 30, 2025

ముంపు గ్రామాల్లో పంటల పరిస్థితి తెలుసుకున్న కలెక్టర్

image

మొంథా తుఫాన్ ప్రభావంతో మడ్డువలస డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గురువారం రేగిడి మండలం సంకిలి బ్రిడ్జి వద్ద నాగావళి నది ప్రవాహాన్ని పరిశీలించారు. ముంపు ప్రభావిత గ్రామాల్లో పంటల నష్టం, ప్రజల స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పరివాహక ప్రాంత ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.

News October 30, 2025

డెంకాడ: నేలకొరిగిన వరి పంట పరిశీలించిన ఉన్నతాధికారులు

image

డెంకాడ మండలం చొల్లంగిపేట గ్రామపంచాయతీ పరిధిలోని మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన వరి పంటను జిల్లా వ్యవసాయ అధికారి వీ.టి. రామారావు గురువారం పరిశీలించారు. ఎంత మేర నష్టం కలిగిందో రైతులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు నష్టపోయిన వరి పంట ఎకరాకు రూ. 10,000ల చొప్పున నష్టపరిహారం వచ్చే విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని రైతులకు భరోసా కల్పించారు.

News October 30, 2025

ప్రతి నష్టాన్ని అంచనా వేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని జలాశయాల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలను పర్యవేక్షిస్తూ ఎక్కడా నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. తుఫాన్, వరద పరిస్థితులపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి నష్టాన్ని నమోదు చేసి, అంచనా వేయాలని ఆదేశించారు. నివేదికలు సాయంత్రానికి అందజేయాలన్నారు.