News October 23, 2024
VZM: తాగునీటి వనరుల క్లీనింగ్ పై స్పెషల్ డ్రైవ్

విజయనగరం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తాగునీటి వనరుల క్లోరినేషన్ పై బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ మండల ప్రత్యేక అధికారులను మండల స్థాయి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న రక్షిత నీటి పథకాల ఓవర్‌హెడ్ ట్యాంకులు పైప్ లైన్లు తనిఖీ చేయాలని సూచించారు. అయా ట్యాంకులను నిర్ణీత గడువు లోగా శుభ్రం చేస్తున్నది లేనిది తనిఖీ చేయాలన్నారు.
Similar News
News October 24, 2025
VZM: పోలీసు అమరవీరుల సంస్మరణలో వ్యాస, వక్తృత్వ పోటీలు

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులకు, పోలీసు ఉద్యోగులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఈ పోటీలు అదనపు ఎస్పీ పి.సౌమ్యలత పర్యవేక్షణలో జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగాయి. ‘మహిళలు, పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర’, ‘నేటి పోలీసింగ్‌లో టెక్నాలజీ పాత్ర’ వంటి అంశాలపై పోటీలు చేపట్టారు.
News October 24, 2025
VZM: జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా వెంకటేశ్వరరావు

జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా డి.వెంకటేశ్వర రావు శుక్రవారం బాధ్యలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డిని కలెక్టర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో క్రీడలు, స్టేడియంల పరిస్థితిని వివరించారు. వెంకటేశ్వరరావు గతంలో జిల్లాలో కబడ్డీ కోచ్‌గా, DSDOగా సేవలు అందించారు.
News October 24, 2025
జిల్లాలో 1193 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు: SP

జిల్లా పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎస్పీ దామోదర్ తెలిపారు. బొబ్బిలి, రాజాం, ప్రాంతాల ఆసుపత్రులతో సమన్వయం చేసి హెల్త్ చెకప్‌లు చేపట్టామని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 1193 మంది పోలీసు సిబ్బందికి పరీక్షలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అందుకు సంబంధించి రూ.8.95 లక్షలను చెక్ రూపంలో మేనేజ్మెంట్కు చెల్లించామన్నారు.


