News December 30, 2024

VZM: తొలిరోజు 279 మంది అభ్యర్థులు గైర్హాజరు

image

విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 321 మంది అభ్యర్థులు మాత్రమే PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. తొలి రోజు 279 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ తెలిపారు. కాగా వేకువజామున నాలుగు గంటల నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.

Similar News

News January 17, 2025

పార్వతీపురం: పండగ జరుపుకుని వెళ్తూ అనంత లోకాలకు

image

పార్వతీపురం మన్యం జిల్లా అల్లు వాడకు చెందిన లోలుగు <<15173201>>రాంబాబు<<>>(44) అతని కుటుంబంతో కలిసి పండగ చేసుకుని తిరిగి ఉద్యోగ నిమిత్తం తిరిగి ప్రయాణమయ్యారు. అతని భార్య ఉమాదేవి పాచిపెంటలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. బైక్‌పై వెళ్తుండగా రాంబాబు, పెద్ద కుమారుడు మోక్ష శ్రీహాన్ (5) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చిన్న కుమారుడు సూర్య శ్రీహాన్, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.

News January 17, 2025

VZM: కానిస్టేబుల్ ఎంపికలు.. 185 మంది గైర్హాజరు

image

విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహ దారుఢ్య ఎంపిక ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 415 మంది అభ్యర్థులు PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. 185 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

News January 16, 2025

సీతానగరం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

సీతానగరం మండలం మరిపివలస గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు లోలుగు రాంబాబు (44), అతని కుమారుడు మోక్ష శ్రీహాన్ (5) తమ కుటుంబ కలిసి వెళ్తుండగా వెనకనుంచి లారీ ఢీకొనడంతో మృతి చెందారు. పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తున్నారు.