News October 5, 2024
VZM: దసరా ఉత్సవాల్లో అల్లర్లు జరగకుండా చూడాలి

విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఊరేగింపులు, నిమజ్జనాలు శాంతియుతంగా ముగిసే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. చెరువులు, నదులు వద్ద ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News December 5, 2025
స్క్రబ్ టైఫస్పై ప్రజలకు అవగాహన కల్పించండి: కలెక్టర్

జిల్లాలో స్క్రబ్ టైఫస్పై ప్రజల్లో భయం అవసరం లేదని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. వైద్యశాఖ అధికారులు, సిబ్బందితో శుక్రవారం తన ఛాంబర్లో టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఇది పూర్తిగా నయం అయ్యే వ్యాధని, లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ప్రజలు భయపడకుండా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
News December 5, 2025
VZM: పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు.. అంతలోనే ఆత్మహత్య.!

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం విజయనగరంలోని దాసన్నపేటలో జరిగింది. కోరాడ వీరేంద్ర (25) సింహాచలంలో నేడు పెళ్లి జరగాల్సి ఉంది. ముహూర్తాలు లేకున్నా పెళ్లి చేసుకోవాలని ప్రేమించిన యువతి ఒత్తిడి చేయడమే ఆత్మహత్యకు ప్రాథమిక కారణంగా తెలుస్తోంది. పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పినా,వీరేంద్ర ఎందుకు ఇలా చేశాడో తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 5, 2025
విజయనగరం జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవిస్తే చర్యలు: కలెక్టర్

జిల్లాలో ఎక్కడైనా మాతృ, శిశు మరణాలు సంభవిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని DRC సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అత్యున్నత ప్రభుత్వ యంత్రాగం ఉందని, ప్రభుత్వం మంచి పోషకాహారాన్ని సరఫరా చేస్తోందని, అయినప్పటికీ అక్కడక్కడా మాతృ, శిశు మరణాలు సంభవించడం బాధాకరమన్నారు. ఇకముందు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.


