News October 5, 2024
VZM: దసరా ఉత్సవాల్లో అల్లర్లు జరగకుండా చూడాలి

విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఊరేగింపులు, నిమజ్జనాలు శాంతియుతంగా ముగిసే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. చెరువులు, నదులు వద్ద ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News February 11, 2026
శివరాత్రికి పక్కా ఏర్పాట్లు: కలెక్టర్

శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాల్లో భక్తుల దర్శనాలకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శివరాత్రి పండుగ ఏర్పాట్లతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత పనులు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయి అధికారులతో వీసీలో సుదీర్ఘంగా సమీక్షించారు. దర్శనాలకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూడాలని సూచించారు.
News February 11, 2026
బొబ్బిలి: స్కూల్ బస్సు బోల్తా

బొబ్బిలి మండలం అలజంగి చెట్టు వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. కారాడ సమీపంలో ఉన్న సన్ రైజ్ ఆశ్రమానికి చెందిన విద్యార్థులు బొబ్బిలి పట్టణంలోని పలు విద్యాసంస్థలలో చదువుతున్నారు. పాఠశాలల నుంచి బుధవారం సాయంత్రం ఆశ్రమానికి వెళ్తుండగా అలజంగి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడడంతో 23 మంది విద్యార్థులకు గాయలయ్యాయి. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
News February 11, 2026
VZM: లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి

మార్చి 14వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత కోరారు. బుధవారం బార్ అసోసియేషన్ సభ్యులు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులతో జిల్లా కోర్టులో ఆమె సమావేశం నిర్వహించారు. ప్రమాద బీమా క్లెయిమ్ కేసులు అన్ని సివిల్ దావాలు లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు. ఎక్కువ కేసులు రాజీ చేసి కక్షిదారులకు డబ్బు, సమయం వృధా కాకుండా చూడాలన్నారు.


