News December 29, 2024

VZM: నకిలీ ఐపీఎస్ ఉన్నత విద్యావంతుడే..!

image

నకిలీ IPS సూర్య ప్రకాష్ ఉన్నత చదువులే చదివాడు. స్థానికంగా బీటెక్ పూర్తి చేసిన ఈయన కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీలో MBA చేశాడు. 2003లో ఇండియన్ ఆర్మీలో సిపాయిగా ఎంపికయ్యాడు. 2005లో ఉద్యోగం విడిచిపెట్టి 2016 వరకు కాంట్రాక్ట్ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. కాగా పవన్ పర్యటనలో IPS అంటూ తిరుగుతూ దిగిన ఫొటోలను వాట్సప్ స్టేటస్‌ పెట్టుకోగా ఎంక్వైరీలో అసలు విషయం బయట పడిందని పోలీసులు తెలిపారు.

Similar News

News October 24, 2025

VZM: స్త్రీ నిధి ఋణం వాయిదాలపై అవగాహన వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

image

మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన ముఖ్య కార్యక్రమాల్లో భాగంగా స్త్రీ నిధి ఋణం నెలవారీ చెల్లించాల్సిన వాయిదాల వివరాలను తెలియజేసే పోస్టర్లను కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు తమ ఆర్థిక బాధ్యతలను సులభంగా నిర్వర్తించేందుకు అవగాహన కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

News October 24, 2025

వేతనదారులకు సగటు వేతనం పెంచేందుకు కృషి చేయాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ వేతనదారులకు సగటు వేతనం పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారులను ఆదేశించారు. అధికారులుతో కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. ఫారంపాండ్స్, చెక్‌డ్యామ్‌లు, పశు శాలలు, మ్యాజిక్ డ్రెయిన్స్, మొక్కల నాటే కార్యక్రమాలను నిర్దిష్ట కాలంలో పూర్తి చేయాలని, ఏపీడీలు, ఎంపీడీవోలు గ్రామస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.

News October 24, 2025

VZM: పోలీసు అమరవీరుల సంస్మరణలో వ్యాస, వక్తృత్వ పోటీలు

image

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులకు, పోలీసు ఉద్యోగులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఎస్పీ దామోదర్‌ ఆదేశాల మేరకు ఈ పోటీలు అదనపు ఎస్పీ పి.సౌమ్యలత పర్యవేక్షణలో జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగాయి. ‘మహిళలు, పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర’, ‘నేటి పోలీసింగ్‌లో టెక్నాలజీ పాత్ర’ వంటి అంశాలపై పోటీలు చేపట్టారు.