News August 11, 2024
VZM: నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూపులు

ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా సీటు కోల్పోయిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. S.కోట నుంచి గొంప కృష్ణ, చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున, నెల్లిమర్ల నుంచి కర్రోతు బంగార్రాజు, బొబ్బిలి నుంచి తెంటు లక్ష్ము నాయుడు పదవులు ఆశిస్తున్నారు. జనసేన, బీజేపీ నుంచి పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు.
Similar News
News November 16, 2025
గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలి: కలెక్టర్

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు, గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కరించిన తర్వాత SMS ద్వారా సమాచారం చేరవేస్తామని తెలిపారు.
News November 16, 2025
కుష్ఠు వ్యాధి గుర్తింపుపై స్పెషల్ డ్రైవ్: కలెక్టర్

జిల్లాలో కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధిని గుర్తించేందుకు రేపటి నుంచి 30 వరకు 14 రోజుల ప్రత్యేక డ్రైవ్ను చేపడుతున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ డ్రైవ్లో ఆరోగ్య బృందాలు ప్రతి ఇంటినీ సర్వే చేస్తాయి. కుష్ఠును పూర్తిగా నయం చేయగలిగేదని, ప్రారంభంలో గుర్తించడం అత్యంత కీలకమని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి లక్షణాలు ఉన్నా పరీక్షించుకోవాలని సూచించారు.
News November 15, 2025
VZM: కుష్టు వ్యాధిపై అవగాహన రథాన్ని ప్రారంభించిన DMHO

జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ నెల 17 నుంచి 30 వరకు ఇంటింటి సర్వే ద్వారా కుష్టు కేసులను గుర్తించే “లెప్రసీ కేస్ డిటెక్షన్ కాంపెయిన్” జరగనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. జీవనరాణి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించే ఆటో ప్రచార రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అన్ని గ్రామాల్లో ప్రజలు ఆరోగ్య కార్యకర్తలకు సహకరించాలన్నారు.


