News March 24, 2024
VZM: నారా లోకేశ్ని కలిసిన TDP MLA అభ్యర్థులు

విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అదితి గజపతిరాజు, బేబీ నాయన, కొండపల్లి శ్రీనివాస్ శనివారం విజయవాడలో టీడీపీ నిర్వహించిన ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేనతో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.
Similar News
News November 18, 2025
అల్లూరిలో ఎన్కౌంటర్.. భద్రత చర్యలు కట్టుదిట్టం: VZM ఎస్పీ

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో, విజయనగరం జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్ని ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. పాత నేరస్తుల కదలికలపై కూడా నిఘా పెట్టినట్లు వెల్లడించారు.
News November 18, 2025
10వ తరగతి ఫలితాల్లో జిల్లా ముందజలో ఉండాలి: కలెక్టర్

పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ముందంజలో నిలవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన విద్యా శాఖ సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. తక్కువ ప్రగతి చూపుతున్న విద్యార్థులను గుర్తించి అదనపు బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు మించి ర్యాంకులు సాధించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
News November 18, 2025
VZM: ‘రైతుల ఖాతాల్లో రూ.150 కోట్లు జమ’

సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు జమ చేయనున్నారని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలో 2,27,700 మంది రైతుల ఖాతాల్లో రూ.150.03 కోట్లు జమ కానున్నాయి. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ.7,000 (సుఖీభవ రూ.5వేలు, పీఎం కిసాన్ రూ.2వేలు ) చొప్పున జమ అవుతుందని తెలిపారు.


