News May 4, 2024

VZM: నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలుఇవే

image

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియకు ఫెసిలిటేషన్ కేంద్రాలను అధికారులు కేటాయించారు. రాజాం- (ప్రభుత్వ ఉన్నత పాఠశాల, RTC కాంప్లెక్స్ దరి), బొబ్బిలి-(మున్సిపల్ పాఠశాల గొల్లపల్లి), చీపురుపల్లి-( శ్రీరామ్ జూనియర్ కాలేజ్, SDS కాలేజ్), గజపతినగరం-(బాలికల ఉన్నత పాఠశాల, పురిటిపెంట), నెల్లిమర్ల-(CKMకాలేజ్, MIMS పక్కన), విజయనగరం-(JNTU), శృంగవరపుకోట -(ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ఎస్ కోట)లో ఏర్పాటు చేశారు.

Similar News

News November 11, 2024

విజయనగరం MLC స్థానానికి మూడు నామినేషన్లు

image

స్థానిక సంస్థల MLC ఉప ఎన్నిక కోసం సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్లు దాఖలు గడువు ముగిసింది. మొత్తం మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు JC ఎస్.సేతు మాధవన్ వెల్లడించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఎస్.కోట మండలం బొడ్డవరకు చెందిన ఇందుకూరి సుబ్బలక్ష్మి, అదే మండలం వసి గ్రామానికి చెందిన కారుకొండ వెంకటరావు, వైసీపీ తరుఫున శంబంగి వెంకట చిన అప్పలనాయుడు నామినేషన్లు వేశారు.

News November 11, 2024

విజయనగరం జిల్లాలో పర్యటించిన ఎన్నికల పరిశీలకులు  

image

శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ సోమవారం జిల్లాలో పర్యటించారు. ఆయనకు జిల్లా కలెక్టర్ అంబేడ్క‌ర్ స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల పరిశీలకులతో సమావేశమై శాసనమండలి ఉప ఎన్నికల ఏర్పాట్లపై వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమాలు అమలు, ఎం.సి.సి. బృందాలు ఏర్పాటు తదితర అంశాలను తెలిపారు.

News November 11, 2024

వాల్తేర్ డీఆర్ఎంతో విజయనగరం ఎంపీ భేటీ.. చర్చించిన అంశాలివే..!

image

☛ కోమటిపల్లి రైల్వే వ్యాగన్ లోడింగ్ పాయింట్‌‌ను సీతానగరం స్టేషన్‌కు మార్చాలి
☛ బొబ్బిలిలో వందే భారత్‌కు హాల్టింగ్
☛ విజయనగరంలోని రైల్వే అండర్ పాస్ నిర్మాణంపై ఆరా
☛ పార్వతీపురం-గుమడ మధ్య ఫ్లైఓవర్ల నిర్మాణం
☛ కొత్తగా ప్రతిపాదించిన పాలకొండ-రాజాం రైల్వే లైన్ నిర్మాణ ప్రగతిపై ఆరా
☛ చీపురుపల్లి రోడ్డు ఓవర్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని ఎంపీ కోరగా సంక్రాంతి లోపు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.