News November 19, 2024

VZM: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

image

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 20న విజయనగరం ప్రభుత్వ ITIలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన 18-35 లోపు వయసు యువకులు అర్హులని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జాబ్ మేళాలో ప్రముఖ ఫార్మా కంపెనీలు హాజరవుతున్నాయని, ఆసక్తి గల వారు https://naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News November 14, 2025

హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు: ఎస్పీ

image

ఎల్.కోట మండలం రేగలో 2021లో భూతగాదాల వివాదంతో హత్య జరిగింది. ఈ కేసులో ముగ్గురి నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.3వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తీర్పు ఇచ్చారని SP దామోదర్ తెలిపారు. ఈశ్వరరావు అనే వ్యక్తిని కర్రలతో దాడి చేసి చంపినట్టు నేరం రుజువైనందున విశ్వనాథం, దేముడమ్మ, లక్ష్మిలకు శిక్ష విధించారని వెల్లడించారు. ఏ1గా ఉన్న నిందితుడు అప్పారావు విచారణలో మృతి చెందాడన్నారు.

News November 14, 2025

VZM: ‘మధుమేహంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు’

image

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన సదస్సులు, స్క్రీనింగ్ పరీక్షలను శుక్రవారం నిర్వహించినట్లు DMHO జీవనరాణి తెలిపారు. మొత్తం 44 కార్యాలయాల సిబ్బందికి టెస్టులు చేయడంతో పాటు, అన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు మధుమేహంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. మధుమేహంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

News November 14, 2025

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం: కలెక్టర్

image

ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యానికి, పర్యావరణానికి, రైతులకు లాభదాయకమని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. స్థానిక యూత్ క్లబ్‌లో నిర్వహించిన రిసోర్స్ పర్సన్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం పెరగడంతో భూమి సారం తగ్గిపోగా, అవశేషాలు ఆహారం ద్వారా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. సహజ ఎరువులు భూమి సారాన్ని పెంపొందిస్తాయని చెప్పారు.