News January 29, 2025

VZM: నెలకు రూ.45వేలు జీతంతో ఉద్యోగం

image

జిల్లా కోర్టు పరిధిలో స్పెష‌ల్ జ్యుడిషియ‌ల్ మెజిస్ట్రేట్ పోస్టు భ‌ర్తీ కోసం అర్హులైన అభ్య‌ర్ధుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్టు జిల్లా జ‌డ్జి సాయిక‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి బుధవారం తెలిపారు. ఎంపికైన వారికి నెల‌కు రూ.45వేలు పారితోషికం,రూ.5వేలు ర‌వాణాభ‌త్యం లభిస్తుందన్నారు. న్యాయ‌వాద వృత్తిలో ఐదేళ్ల అనుభ‌వం క‌లిగిన వారు అర్హులని, పూర్తి వివరాలకు పూల్ బాగ్‌లో ఉన్న జిల్లా కోర్టును సంప్రదించాలన్నారు.

Similar News

News October 18, 2025

VZM: బాల సంరక్షణ కేంద్రాలకు ధ్రువపత్రాల పంపిణీ

image

బాలల స‌రంక్ష‌ణా కేంద్రాల‌కు కలెక్టర్ రాంసుంద‌ర్ రెడ్డి శుక్ర‌వారం ధృవ‌ప్ర‌తాల‌ను పంపిణీ చేశారు. జిల్లాలోని మూడు బాల సద‌నాలు, ఒక చిల్డ్ర‌న్ హోమ్, ఒక‌ శిశుగృహ హోమ్, 4 చైల్డ్ కేర్ ఎన్‌జిఓ హోమ్స్‌ కు ఫైనల్ సర్టిఫికెట్స్ అందజేశారు. జిల్లాలోని శిశు సంరక్షణ సంస్థలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడానికి ఈ జిల్లా స్థాయి తనిఖీ కమిటీ పనిచేస్తుందని ఆయన తెలిపారు.

News October 17, 2025

పుణ్యక్షేత్రాలకు విజయనగరం నుంచి ప్రత్యేక బస్సులు

image

కార్తీక మాసంలో భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట పంచారామాల దర్శనానికి అక్టోబర్ 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో బస్సులు నడుస్తాయని, సూపర్ లగ్జరీ రూ.2000, అల్ట్రా డీలక్స్ రూ.1950గా చార్జీలు నిర్ణయించామన్నారు. టిక్కెట్లు www.apsrtconline.in లేదా సమీప డిపోలో లభ్యమన్నారు.

News October 17, 2025

విజయనగరం ఎంప్లాయిస్ గ్రీవెన్స్‌కు 27 ఫిర్యాదులు

image

కలెక్టరేట్లో ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఎంప్లాయిస్ గ్రీవెన్స్‌లో 27 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. ట్రెజరీ, డ్వామా, ఈపీడీసీఎల్, మెడికల్ విభాగాలకు చెందిన ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. గత శుక్రవారం అందిన 40 ఫిర్యాదుల్లో చాలావరకు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.