News November 19, 2024
VZM: ‘నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు కంటి పరీక్షలు చేయించాలి’

నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో దృష్టిలోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయని అందువల్ల అటువంటి వారికి కంటి పరీక్షలు చేయించడంలో తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. ప్రపంచ ప్రి మెచ్యూరిటీ డే నడకను కలెక్టరేట్ వద్ద మంగళవారం ప్రారంభించారు. దేశంలో ప్రతి ఏటా 3.6 మిలియన్ల పిల్లలు నెలలు నిండకుండా పుడుతున్నారని, వారికి కంటి పరీక్షలు తప్పనిసరన్నారు.
Similar News
News October 31, 2025
వారణాసిలో సిక్కోలు వాసులు గాయపడడం బాధాకరం: మంత్రి

వారణాసి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది గాయపడిన ఘటన బాధాకరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. యూపీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని శ్రీకాకుళం అధికారులను ఆదేశించామన్నారు. గాయపడిన వారు కోలుకున్న వెంటనే స్వస్థలాలకు తిరిగి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
News October 31, 2025
ఎస్ కోట: ‘ఖైదీల పట్ల వివక్ష చూపించరాదు’

ఎస్.కోట సబ్జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. కృష్ణ ప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వివరించారు. ఖైదీలపై వివక్షత చూపరాదని హెచ్చరించారు. జైల్లో నడుస్తున్న లీగల్ ఎయిడ్ క్లినిక్స్ పనితీరును పరిశీలించారు. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News October 30, 2025
VZM: ఉద్యోగులకు క్రీడా ఎంపిక పోటీలు వాయిదా

ప్రభుత్వ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు జరగాల్సిన క్రీడా ఎంపిక పోటీలను మొంథా తుఫాన్ కారణంగా నిరవధికంగా వాయిదా వేశామని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు వాయిదా వేశామని, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల తదుపరి తేదీలు వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.


