News June 13, 2024
VZM: నేటి నుంచి మోగనున్న బడిగంట

జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి బడి గంట మోగనుంది. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. 50 రోజుల పాటు పుస్తకాలు మూలన పడేసిన విద్యార్థులు స్కూల్ బ్యాగ్ నిండా పుస్తకాలు, చేతిలో క్యారేజీ , సైకిల్ మీద, ఆటోల్లో, బస్సుల్లో బడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థులకు ఘన స్వాగతం పలికేందుకు అన్ని పాఠశాలలు సిద్ధమయ్యాయి.
Similar News
News February 23, 2026
VZM: ఇంటర్ పరీక్షకు 862 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షను 20,430 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 19,568 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్స్పెక్టర్ తవిటినాయుడు తెలిపారు. మొత్తం 862 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100 మంది ఇన్విజిలేటర్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లు నియమించారు. జిల్లాలో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.
News February 23, 2026
VZM: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కె.ఎల్.పురంలోని శ్రీ లక్ష్మీగణపతి జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదులను సందర్శించి, వారికి కల్పించిన వసతులపై అధికారులను ఆరా తీశారు.
News February 23, 2026
అమృత్ భారత్ రైళ్లకు కొత్తవలసలో హాల్ట్

కొత్తవలస రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ పథకంలో చేర్చడంతో పలు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించినట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. 16597/98, 16223/24, 16107/08, 16523/24 ఈ రైళ్లు కొత్తవలస, దువ్వాడ మీదుగా గమ్యస్థానాలకు చేరుకుంటాయన్నారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


