News March 1, 2025
VZM: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయనగరం జిల్లాలో 177 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం 20,902, ద్వితీయ సంవత్సరం 20,368మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని ఆర్ఐఓ ఆదినారాయణ చెప్పారు.
Similar News
News November 1, 2025
విజయనగరంలో బిర్సా ముండా జయంతి వేడుకలు

విజయనగరం గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా జన జాతీయ గౌరవ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, గాం గంటం దొర, పండు పడాల్ వంటి నాయకుల త్యాగాలను స్మరించారు. విద్యార్థులతో మెగా ర్యాలీ, మొక్కలు నాటడం, ఆటల పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నవంబర్ 15న జరిగే మెగా ఈవెంట్కు సిద్ధంగా ఉన్నామని గిరిజన సంక్షేమ అధికారి తెలిపారు.
News November 1, 2025
కుష్టు వ్యాధి గుర్తింపు ప్రత్యేక డ్రైవ్: కలెక్టర్

నవంబర్ 17 నుంచి 30 వరకు జిల్లాలో కుష్టు వ్యాధి గుర్తింపు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ ఛాంబర్లో శనివారం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కుష్టు వ్యాధి పూర్తిగా నయం చేయగల వ్యాధి అని, కుష్టు వ్యాధి సోకిన వారిని సమాజం చిన్న చూపు చూస్తుందన్న అపోహను విడనాడితే సమాజం నుండి కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు.
News November 1, 2025
విజయనగరం JNTU విద్యార్థులకు గుడ్ న్యూస్

జేఎన్టీయూ గురజాడ సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులపై ఉన్న ఆర్థిక భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తూ ఉపకులపతి ఆచార్య వి.వి. సుబ్బారావు శుక్రవారం ప్రకటించారు. ధ్రువీకరణ పత్రాలకు విద్యార్థులు రూ.3వేలు చెల్లించాల్సి వచ్చేదని, ఇకపై రుసుము లేకుండా 24 గంటల్లోపే ఆన్లైన్ ద్వారా పత్రాలు పొందవచ్చన్నారు. నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుందని తెలిపారు.


