News June 12, 2024

VZM: నేడు ఆలస్యంగా విశాఖపట్నం-బెనారస్ రైలు

image

రైలు నెంబరు 18311 విశాఖపట్నం నుంచి బెనారస్ వెళ్ళే రైలు నేడు తెల్లవారుజామున 04.20 విశాఖపట్నంలో బయలుదేరే బదులు ఉదయం 07.05 గంటలకు బయలుదేరుతుందని రైల్వే వర్గాలు తెలిపారు. కొత్తవలసకు ఉదయం 07.35 గంటలకు వస్తుందని తెలిపారు. ఆలస్యానికి చింతిస్తున్నామని రైల్వే అధికారులు కోరారు. ప్రయాణీకులు గమనించాలని ఓ ప్రకటనలో తెలిపారు.

Similar News

News October 28, 2025

తప్పుడు వార్తలతో వైరల్ చేస్తే తప్పవు: ఎస్పీ

image

తుపాన్ నేపథ్యంలో తప్పుడు వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చర్యలు తప్పవని SP ఏ ఆర్ దామోదర్ మంగళవారం హెచ్చరించారు. మొంధా తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సమయంలో కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 28, 2025

అన్ని బృందాలు సిద్ధంగా ఉన్నాయి: డీఐజీ

image

మొంథా తుఫాను సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సూచించారు. బర్రిపేటలో సోమవారం ఆయన పర్యటించారు. తీరప్రాంతాల్లో మెరైన్, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌, SDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థల్లో అంతరాయం వచ్చే అవకాశం ఉందని, ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News October 27, 2025

VZM: జిల్లాలో 122 కొత్త పోలింగ్ కేంద్రాలు

image

జిల్లాలో 122 కొత్త పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని DRO శ్రీనివాసమూర్తి తెలిపారు. విజయనగరం కలెక్టరేట్‌లో అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 7 నియోజకవర్గాల్లో.. పోలింగ్ కేంద్రాల స్థాన మార్పు కోసం 23, పేరు మార్పు కోసం 51, కొత్త పోలింగ్ కేంద్రాలుగా 122 ప్రతిపాదనలు గుర్తించబడినట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనలు భారత ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు వెల్లడించారు.