News July 4, 2024

VZM: నేడు కలెక్టరేట్‌లో అల్లూరి జయంతి

image

నేడు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు అల్లూరి సీతారామ రాజు జయంతిని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ తెలిపారు. జిల్లా అధికారులు, సిబ్బంది ఈ వేడుకలకు హాజరు కావాలని ఆదేశించారు. అన్ని జిల్లా, డివిజినల్, మండల, గ్రామ స్థాయి కార్యాలయాల్లో అల్లూరి జయంతి వేడుకలను నిర్వహించాలని సర్కులర్ జారీ చేశారు.

Similar News

News December 16, 2025

సంక్రాంతికి విజయనగరంలో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

image

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా విజయనగరం ఆర్టీసీ వారు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు డీపీటీవో జీ.వరలక్ష్మి తెలిపారు. విజయనగరం, ఎస్.కోట డిపోల నుంచి జనవరి 8-14వ తేదీ వరకు ప్రతీ రోజు విజయవాడ, భీమవరం, రాజోలు, విశాఖకి ప్రత్యేక బస్సులు నడుపుటకు వెల్లడించారు. ఈ బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు లేవని.. సాధారణ ఛార్జీలు మాత్రమే వర్తిస్తాయి చెప్పారు.

News December 16, 2025

VZM: హాయ్ అని మెసేజ్ పెడితే చాలు.. ఫోన్‌లోకే సమాచారం

image

ప్రజలకు పోలీసు సేవలు మరింత సులభంగా, వేగంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. 9552300009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపితే FIR, ఎఫ్ఐఆర్ స్థితి, ఈ-చలాన్ వివరాలను ఇంటివద్ద నుంచే పొందవచ్చన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్‌లు అందుబాటులో ఉన్నాయని, వినియోగించుకోవాలన్నారు.

News December 16, 2025

విజయనగరం ఆర్టీసీ ఈడీగా మాధవీలత బాధ్యతల స్వీకారం

image

విజయవాడ ఆర్టీసీ మార్కెటింగ్ విభాగం నుంచి పదోన్నతి పొందిన మాధవీలత.. విజయనగరం రీజినల్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె రీజినల్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొరను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రీజినల్‌లో ఉన్న బస్సుల కొరత, ప్రయాణికుల ఇబ్బందులు, కార్మికులు, సిబ్బంది సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు.