News January 23, 2025
VZM: నేడు మంత్రి కొండపల్లి షెడ్యూల్

రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం ఉదయం 8గంటలకు పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4గంటలకు గజపతినగరం RTC కాంప్లెక్స్ వద్ద శ్రీ కన్వెన్షన్లో పి.యమ్.సూర్య ఘర్ పథకం అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి కార్యాలయం తెలిపింది.
Similar News
News February 13, 2025
తెర్లాం: వివాహేతర సంబంధమే హత్యకు కారణం?

తెర్లాం మండలం నెమలాంలో <<15434993>>సాఫ్ట్‌వేర్ ఉద్యోగి<<>> కె.ప్రసాద్ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెమలాంకు చెందిన ఓ వివాహితతో ప్రసాద్ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమె భర్త, మరిది కలిసి హత్య చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు నిందితులు విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 13, 2025
రాజాం : తండ్రిని చూసేందుకు వెళ్లి దారిలో మృతి

రాజాం కాంప్లెక్స్ ఆవరణలో కాలువలో బుధవారం మెరకముడిదాంకి చెందిన మజ్జి రామకృష్ణ మృతి చెందిన విషయం <<15436428>>తెలిసిందే<<>>. శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు రామకృష్ణ రాజాం వచ్చాడు. కాంప్లెక్స్‌లో బైక్ ఉంచి బస్సులో వెళ్లాడు. రాత్రి తిరిగి కాంప్లెక్స్‌కి చేరుకున్నాడు. ఈక్రమంలో గుండెపోటు వచ్చి కాలువలో పడిపోగా ఎవరు చూడకపోవడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
News February 13, 2025
వంగర: ఉరి వేసుకొని వ్యక్తి మృతి

మెరకముడిదాంకు చెందిన శ్రీరాములు(52) చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. దీంతో వంగర మండలం చౌదరివలసలోని తన భార్య చెల్లెలు రమణమ్మ ఇంటికి వచ్చి ఆమెను డబ్బులు అడిగాడు. తను లేవని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం చౌదరివలస సమీప తోటలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.