News March 3, 2025
VZM: నేడే MLC ఫలితం.. సర్వత్రా ఉత్కంఠ..!

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. విశాఖ AU ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 20,783 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ప్రధానంగా పోటీలో కూటమి బలపరిచిన రఘువర్మ(APTF),PDF తరఫున విజయగౌరి, PRTU తరఫున శ్రీనివాసులునాయుడు ఉన్నారు. వీరిలో గురువులు ఎవరికి పట్టం కట్టారో మరి కొన్ని గంటల్లోనే తేలిపోనుంది.
Similar News
News November 26, 2025
VZM: రేపు డయల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో కార్యక్రమం

డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు విజయనగరం ఆర్టీసీ డిపో ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. కాంప్లెక్స్ డీపీటీవో కార్యాలయంలో ఉదయం 11 గంటలు నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. డిపో పరిధిలో గల ప్రయాణికులకు ఎటువంటి సమస్యలున్నా, సలహాలు ఉన్న నం.9959225604 ద్వారా తెలిపి నివృత్తి చేసుకోవాలని కోరారు.
News November 26, 2025
గడ్డిమందు తాగి మహిళ మృతి: గజపతినగరం ఎస్ఐ

గజపతినగరం మండలం భూదేవిపేటకి చెందిన జగ్గినేని గౌరీ (43) కడుపునొప్పి కారణంగా ఈనెల 25 సాయంత్రం గడ్డి మందు తాగిందని గజపతినగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఆమెను చికిత్స నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుమార్తె డొంక పూజిత ఫిర్యాదు చేసిందన్నారు.గౌరి మృతిపై కుటుంబ సభ్యులకు కొన్ని అనుమానాలు ఉన్నాయని వాటిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News November 26, 2025
విజయనగరంలో 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.


