News April 13, 2025
VZM: ‘నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర ఎనలేనిది’

ప్రజల భద్రత, నేరాల నియంత్రణలోను, శాంతిభద్రత పరిరక్షణలోను సీసీ కెమెరాల పాత్ర ఎనలేనిదని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ప్రజల భద్రతలో సీసీ కెమెరాల పాత్రను గుర్తించి, వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. జిల్లాలో నూతనంగా 3000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా చేసుకొని, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా స్థానికుల సహకారంతో 2125 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసామన్నారు.
Similar News
News April 17, 2025
సమ్మర్ హాలీడేస్.. విజయనగరంలో చూడదగ్గ ప్రదేశాలు

వేసవి సెలవులకు విజయనగరం జిల్లా స్వాగతం పలుకుతోంది. సెలవుల్లో కుటుంబ సమేతంగా ఆహ్లాదకరంగా గడిపేందుకు టూర్ ప్లాన్ చేసుకునేందుకు మంచి వేదిక కానుంది. తాటిపూడి రిజర్వాయర్, రామతీర్థం బోడికొండ, చాకలిపేట రామనారాయణం, భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో సముద్ర తీర ప్రాంతాలు, గంట్యాడలో వైకుంఠ గిరి, పుణ్యగిరి శివాలయం, తదితర ప్రాంతాలను సందర్శించి ఆధ్యాత్మిక, పర్యాటక అనుభూతి పొందవచ్చు.
News April 17, 2025
VZM: కన్నకూతురిపై తండ్రి అత్యాచారం

భీమిలిలో మంగళవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురి పట్ల కీచకుడిగా మారాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన అప్పన్న మద్యం మత్తులో తగరపువలసలో ఉన్న షాపులో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అడ్డుపడి భీమిలి పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స నిమిత్తం KGHకి తరలించారు. మహిళా స్టేషన్ ACP పెంటారావు సంఘటనా స్థలాన్ని బుధవారం పరిశీలించారు.
News April 17, 2025
VZM: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

విశాఖలో ఇంటర్ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా గరివిడికి చెందిన వేదాంత కార్తికేయ మారికవలస ఓజోన్ వ్యాలీలోని శ్రీచైతన్య కాలేజీలో ఈనెల 13న జాయిన్ అయ్యాడు. బుధవారం ఉదయం టిఫిన్ చేసిన తరువాత హస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోయాడు. మృతదేహాన్ని విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు.