News December 31, 2024
VZM: న్యూ ఇయర్ హంగామా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735614856752_52016869-normal-WIFI.webp)
పాత సంవత్సరం పూర్తి కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. డిసెంబర్ 31వ తేదీ అంటే తెలియని సంతోషం అందరిలో కలుగుతుంటుంది. ఇంటి ముంగిట రంగుల ముగ్గులు అద్దుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతుంటారు. మరీ ముఖ్యంగా యువత పర్యాటక ప్రాంతాలను సందర్శించి అర్ధరాత్రి 12 గంటలకు కేకును కట్ చేస్తూ సంబరాలు చేసుకుంటారు. మరి ఈ ఏడాది మీ న్యూ ఇయర్ ప్లాన్ ఏంటి? కామెంట్ చేయండి.
Similar News
News February 5, 2025
మంత్రి కొండపల్లితో ఈ-వెహికల్ సంస్థ ప్రతినిధులు భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738689192704_52016869-normal-WIFI.webp)
విజయవాడ ఏపీ సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఈ-వెహికల్ సంస్థ ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
News February 5, 2025
ఈ నెల 8న కొత్తవలసకు మాజీ ఉపరాష్ట్రపతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738685546321_52016869-normal-WIFI.webp)
కొత్తవలస మండలంలోని చింతలపాలెంలో ఈ నెల 8న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. భీష్మ ఏకాదశి పర్వదినం పురష్కరించుకుని చిట్టిపాప తీర్ధ మహోత్సవం సందర్భంగా జరగనున్న సాహిత్యగోష్టికి వెంకయ్యనాయుడు హాజరవుతారని సర్పంచ్ సీతారామపాత్రుడు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారని చెప్పారు.
News February 4, 2025
విశాఖలోని విజయనగరం వాసి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738665418915_1258-normal-WIFI.webp)
విశాఖలోని విజయనగరం వాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మృతుడు విజయనగరం జిల్లా తెర్లాం మండలం పనుకువలస గ్రామానికి చెందిన అలుగుబెల్లి గణేశ్ (43)గా పోలీసులు గుర్తించారు. విశాఖలో పెయింటర్‌గా పనిచేస్తున్న గణేశ్ మిథిలాపురిలోని ఉడాకాలనీలో 9 నెలలుగా ఉంటున్నాడు. కాగా మంగళవారం ఉదయం హాల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతిచెందినట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు.