News November 10, 2024
VZM: పంచారామ క్షేత్రాలకు ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు

కార్తీక మాసం పురష్కరించుకుని భక్తులు ఒకే రోజు ఐదు పంచారామ క్షేత్రాలను దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు విజయనగరం ఆర్టీసీ డీఎం జె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వచ్చేవారం వెళ్లాలనుకునేవారు తమను సంప్రదించాలని కోరారు.
Similar News
News March 17, 2026
VZM: 22న బాడీ బిల్డర్స్ పోటీలు

యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకరరావు పిలుపునిచ్చారు. పట్టణంలోని రాజీవ్ క్రీడా మైదానంలో మంగళవారం మాట్లాడారు. 22న గురజాడ కళాభారతిలో “మిస్టర్ VZM-2026” బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 55 నుంచి 75 కేజీల వరకు 6 కేటగిరీల్లో పోటీలు జరగనున్నాయన్నారు. మత్తు పదార్థాలపై అవగాహన కల్పించేందుకే పోటీలు నిర్వహిస్తునమన్నారు.
News March 17, 2026
19న ఘనంగా ఉగాది వేడుకల నిర్వహణ: VZM కలెక్టర్

శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈనెల 19న ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. స్థానిక శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో జిల్లా స్థాయి కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. వేదిక అలంకరణ, పబ్లిక్ అడ్రస్ సిస్టం, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, తాగునీరు, తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు.
News March 17, 2026
విజయనగరంలో నేడు జాబ్ మేళా

విజయనగరంలోని మహారాజా కాలేజ్‌లో ఈ నెల 17 ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ అధికారులు సోమవారం తెలిపారు. ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్, డెవలప్మెంట్ ఆఫీసర్, కెమిస్టు, అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి సుమారు 250 ఖాళీలు భర్తీ చేయనున్నాయని, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు అర్హులన్నారు. అభ్యర్థులకు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ కార్డు తప్పనిసరి అని సూచించారు.


