News December 5, 2024

VZM: పండ‌గ వాతావ‌ర‌ణంలో మెగా పేరెంట్స్ డే

image

జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 7న మెగా పేరెంట్, టీచ‌ర్స్ స‌మావేశాల‌ను ఒక పండుగ వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ స‌మావేశాలు ప్ర‌తీ ఒక్క‌రికీ ఒక మ‌ధుర స్మృతిలా మిగిలిపోవాలన్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని ర‌గ‌ల్చాలని, వారిలో సృజ‌నాత్మ‌క‌త‌ను వెలికి తీసి, ప్ర‌తిభ‌కు ప‌ట్టం క‌ట్టాలన్నారు.

Similar News

News January 21, 2025

VZM: ప్రభుత్వ శాఖలపై మంత్రి అనిత సమీక్ష

image

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, రెవెన్యూ, డ్వామా కార్యక్రమాలపై ఆమె సమీక్ష జరిపారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, MP కలిశెట్టి అప్పలనాయుడు, MLA లు కిమిడి కళా వెంకట్రావు, కొండ్రు మురళీ మోహన్, కోళ్ల లలితకుమారి, లోకం నాగమాధవి, తదితరులు పాల్గొన్నారు.

News January 21, 2025

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం

image

పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెమ్ కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 21, 2025

కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మహిళ మృతి

image

శృంగవరపుకోట మండలం సన్యాసయ్య పాలెం గ్రామానికి చెందిన బర్ల సత్యవతమ్మ (85) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిందని ఎస్.కోట సీఐ సూర్యనారాయణ తెలిపారు. ఈ నెల 16వ తేదీన గుడికి వెళ్లి పూజ చేస్తున్న సమయంలో దీపం తగిలి చీరకు నిప్పు అంటుకొని తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.