News June 29, 2024

VZM: పదవీ విరమణ పొందిన సిబ్బందికి ఎస్పీ సన్మానం

image

జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పని చేసి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ దీపిక పాటిల్ శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో వారు చేసిన సేవలను కొనియాడారు. విధిలో చేసిన సేవలే అందరికి గుర్తింపునిస్తాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సేవలందించారని, ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని అన్నారు.

Similar News

News September 18, 2025

VZM: ‘యూరియా కొరతపై సోషల్ మీడియాలో అసత్య వార్తలు’

image

విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది రైతులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి వార్తలు పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. యూరియాను ఇప్పటివరకు 30,395 మెట్రిక్ టన్నులు, 11,426 మెట్రిక్ టన్నులు డి.ఏ.పి, 9379 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ వివిధ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు.

News September 18, 2025

పెళ్లి పేరుతో మోసం చేసిన ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదు: SI

image

సంతకవిటి పోలీస్ స్టేషన్‌లో గురువారం ఓ ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదైంది. SI గోపాలరావు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ ఆర్మీ ఉద్యోగి కొన్నేళ్లుగా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత ముఖం చాటేశాడని, దీంతో ఆర్మీ ఉద్యోగిపై సదరు యువతి గురువారం సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI పేర్కొన్నారు.

News September 18, 2025

VZM: ఓపెన్ కేటగిరి బార్లకు లాటరీ విధానం ద్వారా ఎంపిక

image

జిల్లాలో ఓపెన్ కేటగిరి బార్లకు లాటరీ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ బుధవారం విజయవంతంగా పూర్తయింది. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, జేసీ సేతు మాధవన్ సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 16 అప్లికేషన్లు అందగా, వాటి ద్వారా రూ.81.6 లక్షలు వచ్చాయని జిల్లా అబ్కారీ శాఖ అధికారి బమ్మిడి శ్రీనాథుడు తెలిపారు. లాటరీ ప్రక్రియలో జిల్లాలో నాలుగు బార్లకు ఎంపిక జరిగిందన్నారు.