News March 13, 2025

VZM: పదో తరగతి పరీక్షలకు 2,248 మంది ఇన్విజిలేటర్లు

image

విజయనగరం జిల్లాలో ఈనెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 119 సెంటర్లలో 23,765 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధిస్తారు. జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేస్తారు. హాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరూ మొబైల్ తీసుకెళ్లకూడదు. రెండు విడతలగా 2,248 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు.

Similar News

News November 17, 2025

విజయనగరం జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు: మంత్రి

image

రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతినగరంలో ధాన్యం సేకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ధాన్యం సేకరణకు జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలను, 261 క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చెల్లింపులు 48 గంటల్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం నెంబర్ 8978975284 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

News November 16, 2025

1100 కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

అర్జీదారులు ‘మీ కోసం కాల్ సెంటర్ 1100’ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

News November 16, 2025

చలికాలంలో స్కిన్ అలర్జీలు రాకుండా చూసుకోవాలి: డా.వెంకటాచలం

image

చలికాలంలో స్కిన్ అలర్జీలు రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహారాజా సర్వజన ఆసుపత్రి డెర్మటాలజీ హెచ్ఓడీ డా.వెంకటాచలం ఆదివారం తెలిపారు. శరీరం పొడిబారకుండా చూసుకోవాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయట తిరగకూడదన్నారు. స్నానం చేసిన వెంటనే గ్లిజరిన్ ఆయిల్ లేదా కొబ్బరినూనె రాసుకోవాలన్నారు. ఆసుపత్రిలోని అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.