News March 13, 2025
VZM: పదో తరగతి పరీక్షలకు 2,248 మంది ఇన్విజిలేటర్లు

విజయనగరం జిల్లాలో ఈనెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 119 సెంటర్లలో 23,765 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధిస్తారు. జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేస్తారు. హాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరూ మొబైల్ తీసుకెళ్లకూడదు. రెండు విడతలగా 2,248 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు.
Similar News
News March 15, 2025
VZM: ‘ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి’

విజయనగరంలోని GST కార్యాలయాన్ని రాష్ట్ర జీఎస్టీ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి ఏ.బాబు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పన్ను వసూళ్లపై చర్చించారు. రాష్ట్ర రెవెన్యూ పెంపుపై కొన్ని మార్గదర్శకాలను ఆయన అందజేశారు. మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని సూచించారు. ప్రభుత్వానికి రావలసిన రెగ్యులర్ రిటర్న్, బకాయి పన్నుల వసూలు చేయాలన్నారు.
News March 15, 2025
VZM: ఈనెల 16న FRO ఉద్యోగాలకు రాతపరీక్ష

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 16న జరిగే రాతపరీక్షకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆదేశించారు. పట్టణంలోని తమ ఛాంబర్లో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12 గంటలు వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటలు వరకు జరుగుతాయని చెప్పారు. రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
News March 15, 2025
సన్మార్గంలో జీవించకపోతే కఠిన చర్యలు: SP

విజయనగరం జిల్లాలో రౌడీ షీట్ కలిగిన వ్యక్తులు నేర ప్రవృత్తిని విడనాడకుంటే కఠిన చర్యలు తప్పవని SP వకుల్ జిందాల్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. రౌడీ షీట్ కలిగిన వ్యక్తుల ప్రవర్తన, కదలికలను నిత్యం గమనించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. బ్యాడ్ క్యారెక్టర్ షీట్లు కలిగిన వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. బీసీ షీట్లు కలిగిన వ్యక్తుల లేటెస్ట్ ఫోటోలు తీయాలన్నారు.