News December 24, 2024
VZM: పవన్ కళ్యాణ్ అభిమాని ఇంట్లో విషాదం`

కొత్తవలస మండలం రామలింగాపురంలో <<14964633>>బ్రైన్ ట్యామర్<<>>తో అఖిర్ నందన్(6) చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ బాలుడి తండ్రి అప్పలరాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. దీంతో పవన్ కళ్యాణ్ కుమారుడి పేరు కలిసేలా అఖిర్ నందన్ అని తన కుమారిడికి పేరు పెట్టుకుని మురిసిపోయాడు. కానీ విధి ఆడిన వింతనాటకంలో చిన్న వయస్సులో తన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Similar News
News December 2, 2025
బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి

బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేట్ కళాశాలలో చదవ లేక పేదలు విద్యకు దూరం అవుతున్నారని చెప్పారు.
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.