News November 28, 2024

VZM: పవన్ కళ్యాణ్ దృష్టికి ఏనుగుల సమస్య

image

ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగుల సమస్యను డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తీసుకువెళ్లానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఏనుగుల సంచారంతో పంటలు, ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు జీవన భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పవన్‌కు వివరించామన్నారు. ఏనుగుల కదలికలను గుర్తించి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీలో కలిసి కోరినట్లు ఎంపీ తెలిపారు.

Similar News

News December 9, 2024

విజయనగరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

దత్తిరాజేరు మండలం దత్తి గ్రామానికి చెందిన గొర్లి రాము జీవనోపాధి కోసం విజయనగరం జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం పాలు పాకెట్ కోసం వెళ్లిన సమయంలో లారీ ఢీకొనడంతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు. రాము మృతి చెందడంతో దత్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News December 9, 2024

24 గంటల్లో డబ్బులు జమ: మంత్రి

image

డెంకాడ మండలం చందకపేట ధాన్యం సేకరణ కేంద్రం వద్ద రైతులతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి నాదేండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించి గిట్టుబాటు ధర, నగదు జమపై ఆరా తీశారు. రైతులకు అండగా ఉంటామని, 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News December 9, 2024

రైతులు అప్రమత్తంగా ఉండాలి: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. ప్రస్తుతం ఎవరూ వరి కోతలు చేయొద్దని, ఇప్పటికే కోసిన వారు కుప్పలు పెట్టాలని పేర్కొన్నారు. నూర్చిన ధాన్యం ఉంటే సమీప కొనుగోలు కేంద్రానికి ఇవ్వాలన్నారు. టార్పలిన్ అవసరం ఉన్నవారు పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులను సంప్రదించాలని కోరారు.