News October 20, 2024
VZM: పవన్ కళ్యాణ్ పర్యటన.. రూట్ మ్యాప్ ఇదే

డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ గుర్లలో సోమవారం పర్యటించనున్నారు. విశాఖ విమానాశ్రయానికి రేపు ఉ.9:30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 11 గంటలకు ఎస్ఎస్ఆర్ పేట వాటర్ సోర్స్ వద్దకు చేరుకొని తనిఖీ చేయనున్నారు. 11:30 గంటలకు గుర్ల పీహెచ్సీని సందర్శిస్తారు. 12:00 గంటలకు గుర్ల నుంచి బయలుదేరి విజయనగరం చేరుకుని కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షిస్తారు. తిరిగి సా.4గంటలకు విశాఖ చేరుకుంటారు.
Similar News
News October 26, 2025
విజయనగరం జిల్లా రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు

విజయనగరం జిల్లాలో మొత్తం 1,04,828 హెక్టార్లలో వరి సాగు జరిగిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. పంటలు పాలుపోసే దశ నుండి కోత దశ వరకు వివిధ దశల్లో ఉన్నాయని, వర్షాల నేపథ్యంలో పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. పొలాల్లో నీరు చేరితే బయటకు పంపే చర్యలు తీసుకోవాలన్నారు. కోతకు ముందు వర్షం వస్తే వరి వెన్నులపై లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపిన ద్రావణంతో పిచికారీ చేయాలన్నారు.
News October 26, 2025
రైతులను అప్రమత్తం చేయండి: కలెక్టర్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వరి పంటకు నష్టం జరగకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం సూచించారు. వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశముందని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మానిటరింగ్ చేయాలని ఆదేశించారు.
News October 26, 2025
విజయనగరంలో 4 ప్రైవేట్ బస్సులు సీజ్

నగరంలో రవాణా శాఖాధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉపరవాణా కమిషనర్ మణికుమార్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లతో కలసి వాహన రికార్డులు, ఫైర్ ఎక్విప్మెంట్, సీటింగ్ బెర్త్‌లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని 4 వాహనాలను సీజ్ చేసి ఆర్టీఓ కార్యాలయానికి తరలించారు.


