News December 20, 2024

VZM: పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ఇదే..

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు సాలూరులో పర్యటించనున్నారు. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో 11.30కి సాలూరు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బసకు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి 12.30కి మక్కువ మండలం బాగుజోలలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ని సందర్శిస్తారు. తర్వాత రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి.. అనంతరం అక్కడ గిరిజనులతో ముఖాముఖీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.10 గంటలకు విశాఖ చేరుకుంటారు.

Similar News

News January 13, 2025

గుమ్మలక్ష్మీపురం: బాలిక ఆత్మహత్య

image

గుమ్మలక్ష్మీపురం మండలం జర్న గ్రామానికి చెందిన జీలకర్ర స్వాతి అనే బాలిక (16) ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం వేకువజామున జరిగింది. గతంలో బొబ్బిలిలో బాలిక పై లైంగిక దాడి జరిగిందని పార్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమెండ్‌కు తరలించారు. ఎల్విన్ పేట ఎస్సై శివప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 13, 2025

VZM: 109 మంది వ్యక్తులపై బైండోవర్ కేసులు:ఎస్పీ

image

జిల్లాలో గతంలో పేకాట, కోడిపందాలతో ప్రమేయం ఉన్న 109 మంది వ్యక్తులను గుర్తించి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి పేరిట చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలతో కోడి పందేలు నియంత్రించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.

News January 13, 2025

VZM: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.