News October 4, 2024
VZM: పవన్ ప్రసంగం కోసం LED స్క్రీన్

పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రసంగాన్ని కోట జంక్షన్లో గురువారం రాత్రి LED స్క్రీన్ ద్వారా ప్రజలు వీక్షించారు. తిరుపతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్, అవనాపు భావన దంపతులు భారీ LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు, జనసైనికులు, నాయకులు ప్రత్యక్షంగా తిలకించారు.
Similar News
News December 13, 2025
VZM: గుండె ఆగింది… కానీ చూపు కొనసాగింది

కంటి వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఓ వృద్ధుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. అయినా ఆయన కుటుంబం అంత శోకంలోనూ మానవీయతను చాటింది. చీపురుపల్లికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఎంపీడీఓ కర్రోతు అప్పారావు (73) శుక్రవారం కంటి పరీక్షల కోసం విజయనగరానికి వెళ్లి అక్కడే కన్నుమూశారు. ఈ విషాదంలోనూ కుటుంబసభ్యులు నేత్రదానానికి అంగీకరించారు. రెడ్క్రాస్, మానవీయత స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్నియా సేకరించారు.
News December 13, 2025
మానవత్వం చాటుకున్న VZM ఎస్పీ.. రోడ్డు ప్రమాద బాధితురాలికి తక్షణ సాయం

ఎస్పీ ఏఆర్.దామోదర్ గరివిడిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్నప్పుడు గుర్ల మండలం దుగ్గివలస గ్రామ సమీపంలో బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక మహిళను గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, గాయపడిన మహిళకు సపర్యలు చేశారు. అనంతరం అటుగా వస్తున్న ఆటోను చికిత్స కోసం నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
News December 13, 2025
24న జాతీయ వినియోగదారుల దినోత్సవం: VZM JC

జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈనెల 24న నిర్వహించాలని విజయనగరం జేసీ ఎస్.సేథు మాధవన్ సూచించారు. శుక్రవారం తన ఛాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 18వ తేదీ నుంచి వినియోగదారుల వారోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈసారి ‘డిజిటల్ న్యాయపాలన, సమర్థ సత్వర పరిష్కారం’ ఇతివృత్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిషులో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ఉంటాయన్నారు.


