News June 30, 2024

VZM: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామానికి చెందిన నక్కెళ్ల గోపి(40) పురుగుమందు తాగి చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతను వేడుకలకు వంటలు చేస్తూ జీవించేవాడు. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. శరీరంపై పలుచోట్ల ఉన్న గాయాలు ఇంకా బాధిస్తుండడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గోపి పురుగుమందు తాగాడు. మృతుడికి భార్య శ్రీదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Similar News

News December 1, 2024

మైనింగ్ కంపెనీ‌పై చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎంకు లేఖ

image

పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో నిర్వహిస్తున్న అత్యం మైనింగ్ ప్రైవేట్ కంపెనీపై చర్యలు చేపట్టాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ కోరారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. మండలంలోని 10 గ్రామాలలోని కొండలను మైనింగ్ కంపెనీ ఆక్రమిస్తుందని అన్నారు. దీనిపై ప్రశ్నించిన ఆయా గ్రామ ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో మైనింగ్ కంపెనీపై చర్యలు చేపట్టాలని కోరారు.

News December 1, 2024

VZM: అలా జరిగి ఉంటే వాళ్లు బతికే వాళ్లేమో..!

image

భోగాపురం రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీకాకుళానికి చెందిన అభినవ్ భార్య మణిమాల విశాఖలో పరీక్ష రాయాల్సి ఉంది. అభినవ్ ఫ్రెండ్ కౌశిక్ వాళ్ల మేనమామ అమెరికా నుంచి వస్తుండటంతో రిసీవ్ చేసుకోవడానికి విశాఖకు బయల్దేరారు. ‘మేమూ నీతో వస్తాం’ అంటూ మణిమాల, అభినవ్ అదే కారులో బయల్దేరారు. ఒకవేళ ఆ భార్యాభర్త వేరుగా విశాఖకు బయల్దేరి ఉంటే బతికేవారేమో. విధి ఆడిన నాటకంలో ఇలా చనిపోయారని బంధువులు వాపోయారు.

News December 1, 2024

VZM: ప‌రిశ్ర‌మ‌లు ప్రారంభించ‌క‌పోతే భూకేటాయింపు ర‌ద్దు 

image

ప‌రిశ్ర‌మ‌ల‌కు కేటాయించిన భూముల్లో నిర్ణీత గ‌డువులోప‌ల‌ ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేయ‌క‌పోతే, కేటాయింపుల‌ను ర‌ద్దు చేయాల్సి ఉంటుంద‌ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లా స్థాయి సమీక్షలో శనివారం ఆయన మాట్లాడారు. త్వ‌ర‌లో బొబ్బిలి గ్రోత్ సెంట‌ర్‌ను సంద‌ర్శించి, కేటాయింపుల‌పై స‌మీక్షిస్తామ‌ని అన్నారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు కేటాయించిన భూముల‌పై స‌మ‌గ్ర నివేదిక‌ను త‌యారు చేయాల‌ని ఆదేశించారు.