News February 28, 2025
VZM: పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు

విజయనగరంలో ఓ యువకుడు పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. CI శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నెయ్యిల వీధికి చెందిన పి.సాయికి మార్చిలో వివాహం జరగాల్సి ఉంది. కాగా ఈనెల 24 ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తల్లికి ఫోన్ చేసి పెళ్లి ఇష్టం లేదని చెప్పి కాల్ కట్ చేశాడు. యువకుడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ CI కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 15, 2025
ఎముకలు కొరికే చలి.. 6 డిగ్రీలు నమోదు

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో నిన్న 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాంధ్రలోనూ 16 డిగ్రీలలోపే నమోదవుతున్నాయి. అటు TGలోని సంగారెడ్డిలోని కోహిర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 7.8 డిగ్రీలుగా రికార్డయ్యింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ 13 డిగ్రీలలోపే నమోదయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో జనాలు ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
News November 15, 2025
తొలి టెస్టు.. బ్యాటర్లు ఇక మీ వంతు

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ పట్టు బిగించాలంటే ఇవాళ కీలకం కానుంది. SA తొలి ఇన్నింగ్సులో 159 పరుగులకే <<18285183>>ఆలౌటవ్వగా<<>> టీమ్ ఇండియా తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(13*), సుందర్(6*) ఉన్నారు. అక్షర్ పటేల్(8వ స్థానం)వరకు బ్యాటింగ్ లైనప్ ఉన్నా ఒకరిద్దరు భారీ శతకాలు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. మరి భారత్ ఇవాళ ఎంత స్కోరు చేస్తుందో కామెంట్ చేయండి?
News November 15, 2025
ఆలుమగల కలహం, ఆరికకూడు వంట

భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్నపాటి గొడవలు, అరికల (కొర్రలు) అన్నం వండడానికి పట్టేంత తక్కువ సమయంలోనే సద్దుమణుగుతాయని ఈ సామెత చెబుతుంది. భార్యభర్తల మధ్య కలహాలు దీర్ఘకాలం ఉండవు. అవి తాత్కాలికమైనవి. త్వరగా సమసిపోతాయి. ఆ కలహాలు వారి మధ్య అనురాగాన్ని మరింత పెంచుతాయి. అలాగే కొర్రల అన్నం కూడా తక్కువ సమయంలోనే సిద్ధమై ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ సామెత అర్థం.


