News December 5, 2024
VZM: ‘పేరెంట్స్ మీట్‌లో ప్రజా ప్రతినిధుల ఫోటోలు ఉండరాదు’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733400414135_52016869-normal-WIFI.webp)
ఈ నెల 7న జరగనున్న మెగా పేరెంట్స్ మీట్‌కు సంబందించి కలెక్టర్ అంబేడ్కర్ సంబంధిత అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే మెగా పేరెంట్స్ , టీచర్స్ మీట్ పండగలా జరగాలన్నారు. విద్యార్థుల చదువు కోసం జరిగే ఈ కార్యక్రమాల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని, మంత్రుల ఫోటోలు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల ఫోటోలు పెట్టకూడదన్నారు.
Similar News
News January 18, 2025
హనీ ట్రాప్‌లో పడొద్దు: ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737163200784_1100-normal-WIFI.webp)
విజయనగరం ప్రజలు హనీ ట్రాప్‌లో పడొద్దని SP వకుల్ జిందాల్ కోరారు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్స్ చేసి ప్రేమ, సెక్స్ పేరుతో ఉచ్చులోకి దించుతారని అనంతరం మీ వీడియోలను మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారన్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు సైబర్ క్రైం పోర్టల్‌కు గానీ 1930కి ఫోన్ చేయాలని SP కోరారు. దీనిపై అవగాహన కోసం షార్ట్ ఫిల్మ్ తీసినట్లు శుక్రవారం తెలిపారు.
News January 17, 2025
VZM: జిల్లాలో రూ.22 కోట్ల మద్యం అమ్మకాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737116483306_50134108-normal-WIFI.webp)
విజయనగరం జిల్లాలో గడిచిన మూడు రోజుల్లో రూ.22 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో మందుబాబులు వైన్ షాపుల ముందు భారీగా క్యూ కట్టారు. జిల్లాలో 177 మద్యం షాపులు, 28 బార్లు ఉండగా 42,000 మద్యం కేసుల విక్రయాలు జరిగాయి. గతేడాది రూ.20 కోట్లు అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది రూ.2 కోట్లు అదనంగా ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
News January 17, 2025
పార్వతీపురం: స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్-
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737112516709_51732952-normal-WIFI.webp)
ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో ఒక శనివారం “స్వచ్ఛత” కోసం అంకితం కావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఆకాంక్షించారన్నారు. అందులో భాగంగా ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.