News December 15, 2024

VZM: పొట్టి శ్రీరాములకు నివాళి అర్పించిన మంత్రి

image

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆదివారం విజయనగరం కలెక్టర్ అడిటోరియంలో ఆయన చిత్ర పటానికి ఘననివాళి అర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరు చేసి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన చేసిన కృషి మరువలేనిది అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో అందరూ కలసి ముందుకు సాగాలని తెలిపారు.

Similar News

News November 20, 2025

VZM: ‘ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రణాళికలు’

image

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి తవిటి నాయుడు అన్నారు. విజయనగరంలోని RIO కార్యాలయంలో గురువారం మాట్లాడారు. ఫిబ్రవరి 23 – మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలు 66 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నమన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

News November 20, 2025

భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు శిక్ష: DSP

image

విజయనగరం మహిళా పోలీసు స్టేషన్‌లో 2022లో నమోదైన వేధింపుల కేసులో నిందితుడు కలిశెట్టి వీరబాబుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించినట్లు DSP గోవిందరావు తెలిపారు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు మద్యం మత్తులో శారీరక, మానసిక వేధింపులు చేసిన భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. సాక్ష్యాలు రుజువుకావడంతో JFCM స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి. బుజ్జి శిక్ష ఖరారు చేశారని చెప్పారు.

News November 19, 2025

జిల్లాలో పర్యటించనున్న షెడ్యూల్డ్ కులాల కమీషన్: కలెక్టర్

image

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ జవహర్ ఆధ్వర్యంలో కమిటీ జిల్లాలో శుక్రవారం పర్యటించనుంది. కలెక్టర్ రాం సుందర్ రెడ్డి వివరాల ప్రకారం.. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌లో షెడ్యూల్డ్ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.