News January 31, 2025
VZM: పోలీసు లాంఛనాలతో ‘వీనా’కు అంత్యక్రియలు

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో స్నిఫర్ డాగ్‌గా విశేషమైన సేవలందించి, మృతి చెందిన పోలీసు డాగ్ ‘వీనా’కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. 2014 సం.లో ఫిమేల్ స్నిఫర్ డాగ్‌గా ‘వీనా’ ఇంటిలిజెన్సు విభాగంలో శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు వచ్చినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. తన చివరి శ్వాస వరకు జిల్లా పోలీసుశాఖకు సేవలందించిందన్నారు.
Similar News
News February 18, 2025
VZM: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపెవరిది..!

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. పీడీఎఫ్ అభ్యర్థిగా యూటీఎఫ్ నేత కె.విజయగౌరి మొదటిసారి బరిలో ఉండగా పీ.ఆర్.టీ.యూ నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా పని చేసిన గాదె శ్రీనివాసులునాయుడు మూడోసారి, ఏపీటీఎఫ్ అభ్యర్థిగా సిట్టింగ్ MLC పాకలపాటి రఘువర్మ రెండోసారి బరిలో ఉన్నారు. ముగ్గురు అభ్యర్థులలో ఎవరికి ఉపాధ్యాయులు పట్టం కడతారోనని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.
News February 18, 2025
ఎస్.కోటలో రెండు బైకులు ఢీ.. బాలుడు మృతి

శృంగవరపుకోట టౌన్ పరిధిలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో 17ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు. బద్దు మహేందర్ రెడ్డి తన బండిపై విశాఖ-అరకు హైవే దాటుతుండగా, బాడితబోయిన దుర్గాప్రసాద్(17) బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలతో బాలుడు మృతి చెందగా.. మహేంద్ర రెడ్డి విజయనగరంలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
News February 18, 2025
విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయ MLC ఓటర్లు ఇలా..!

➤ మొత్తం ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య: 4,937
➤ పురుష ఓటర్లు: 3,100
➤ మహిళా ఓటర్లు:1,837
➤ పోలింగ్ కేంద్రాల సంఖ్య: 29
➤ పోలింగ్ తేదీ: 27.02.2025
➤ ఓట్ల లెక్కింపు తేదీ: 03.03.2025