News February 6, 2025
VZM: ప్రకృతి వ్యవసాయం మోడల్స్ పరిశీలించిన శ్రీలంక బృందం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738770482295_51929894-normal-WIFI.webp)
విజయనగరం జిల్లాలో శ్రీలంక బృందం బుధవారం పర్యటించింది. వేపాడ మండలం ఆకుల సీతంపేటలో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న పంటలను బుధవారం శ్రీలంక బృందం సభ్యులు సందర్శించారు. జిల్లాలో 30 వివోలలో ప్రకృతి వ్యవసాయం చేస్తుండగా వేపాడ మండలాన్ని మోడల్ మండలంగా ఎంపిక చేసినట్లు డిపిఎం ఆనందరావు బృందం సభ్యులకు వివరించారు. అనంతరం పలు కషాయాలు, ద్రావణం వివిధ పత్రాలతో ప్రయోగపూర్వకంగా తయారు చేసి సభ్యులకు వివరించారు.
Similar News
News February 6, 2025
చీపురుపల్లిలో ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738806825165_52061332-normal-WIFI.webp)
ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చీపురుపల్లి మండలంలో చోటుచేసుకుంది. రేగిడిపేటకు చెందిన దన్నాన శ్రీనువాసరావు (35) బుధవారం రాత్రి తన బైక్పై గరివిడి నుంచి చీపురుపల్లి వస్తున్నాడు. ఆంజనేయపురం సమీపంలోకి వచ్చేసరికి ట్రాక్టర్ బైక్ను వెనుక నుంచి ఢీకొట్టడంతో శ్రీనివాసరావు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News February 6, 2025
విజయనగరం: మొన్న మూడు.. నిన్న నిల్..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738803800376_52150088-normal-WIFI.webp)
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు మంగళవారం మూడు నామినేషన్లు దాఖలవగా.. బుధవారం ఒక్కటి కూడా కాలేదు. టీఎన్ఎప్ఎఫ్ మద్దతో పోటీలో ఉన్న సిటింగ్ MLC రఘువర్మ మొన్న నామినేషన్ వేశారు(ఈయనకు కూటమి మద్దతు ఇచ్చినట్లు సమాచారం). యూటీఎఫ్ ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్న విజయగౌరి నేడు విశాఖలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాజీ MLC గాదె శ్రీనివాసులునాయుడుకు పీఆర్టీయూ మద్దతు తెలిపింది.
News February 5, 2025
రాయగడ డివిజన్ పరిధిలో రైల్వే లైన్లు ఇవే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738757667368_1100-normal-WIFI.webp)
రాయగడ <<15366937>>డివిజన్<<>> పరిధిలోని రైల్వే లైన్ల వివరాలను రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
➤ కొత్తవలస- బచేలి/ కిరండోల్
➤ కూనేరు-తెరువలి జంక్షన్
➤ సింగ్ పూర్ రోడ్-కొరాపుట్ జంక్షన్
➤ పర్లాకిముండి- -గుణపూర్
రైల్వే స్టేషన్ ను రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చారు.