News February 6, 2025
VZM: ప్రకృతి వ్యవసాయం మోడల్స్ పరిశీలించిన శ్రీలంక బృందం

విజయనగరం జిల్లాలో శ్రీలంక బృందం బుధవారం పర్యటించింది. వేపాడ మండలం ఆకుల సీతంపేటలో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న పంటలను బుధవారం శ్రీలంక బృందం సభ్యులు సందర్శించారు. జిల్లాలో 30 వివోలలో ప్రకృతి వ్యవసాయం చేస్తుండగా వేపాడ మండలాన్ని మోడల్ మండలంగా ఎంపిక చేసినట్లు డిపిఎం ఆనందరావు బృందం సభ్యులకు వివరించారు. అనంతరం పలు కషాయాలు, ద్రావణం వివిధ పత్రాలతో ప్రయోగపూర్వకంగా తయారు చేసి సభ్యులకు వివరించారు.
Similar News
News March 26, 2025
‘విజయనగరం జిల్లాలో రూ.194 కోట్లు చెల్లించాం’

విజయనగరం జిల్లాలో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 91,836 మంది రోగులు వైద్య సేవలు పొందారని జిల్లా మేనేజర్ రాంబాబు తెలిపారు. జిల్లాలో 66 ప్రభుత్వ ఆసుపత్రులు, 25 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో మొత్తం రూ.194 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రూ.20లక్షల వరకు ప్యాకేజీ పెంచినట్లు వెల్లడించారు.
News March 26, 2025
గొల్లాదిలో కొట్లాట.. ఏడుగురుకి గాయాలు

బాడంగి మండలం గొల్లాది పోలమ్మ ఆలయం సమీపంలో కామన్నవలస, గొల్లాది గ్రామానికి చెందిన వారి మధ్య మంగళవారం కొట్లాట జరిగినట్లు ఎస్ఐ తారకేశ్వరరావు చెప్పారు. ఆలయం సమీపంలో గొల్లాదికి చెందిన ఈపు ఈశ్వరరావు మేకలు మేపుతుండగా కామన్నవలసకి చెందిన ఆదినారాయణ మేకలు మేపేందుకు వచ్చాడు. వారి మధ్య కొట్లాట జరగడంతో ఇరువర్గాలకు చెందిన ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News March 26, 2025
కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న విజయనగరం జిల్లా కలెక్టర్

విజయవాడలో జరుగుతున్న రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో విజయనగరం జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్. అంబేడ్కర్ పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి నివేదిక ఉన్నతాధికారులకు అందజేశారు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు, అనుమతులు గురించి చర్చించారు. జిల్లాలో టూరిజం అభివృద్ధి, వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు.