News October 21, 2024
VZM: ప్రజా వినతుల పరిష్కార వేదికకు 180 వినతులు

కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదికకు మొత్తం 180 అర్జీలు అందాయి. భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 122 వినతులు అందాయి. పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డీఏకు 17 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 5, పంచాయితీ శాఖకు 12, విద్యా శాఖకు 4 అందగా, వైద్య శాఖకు 6 అందాయి. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి.
Similar News
News November 7, 2025
వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి పని: VZM కలెక్టర్

ప్రతి మండలంలో కనీసం వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి పనులు కల్పించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. MNREGS పథకం అమలుపై శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తక్కువ ప్రగతి ఉన్న మండలాలపై దృష్టి సారించాలని సూచించారు. వచ్చే వారం నాటికి 20% పనులు ప్రారంభించాలని, సగటు వేతనాన్ని పెరిగేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.పనికల్పనలో వెనుకబడిన మండలాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
News November 7, 2025
‘కూటమిగా పోరాడదాం.. మెంటాడను సాధిద్దాం’

మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో కొనసాగించేకు ఉమ్మడిగా పోరాడాలని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన నాయకులు సమావేశం అయ్యారు. మెంటాడ మండలం పార్వతీపురం జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. త్వరలో మండల ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులకు తెలియజేస్తామన్నారు.
News November 7, 2025
VZM: ‘మాతృ, శిశు మరణాలు జరగకుండ చర్యలు అవసరం’

జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఎస్. జీవనరాణి వైద్య సిబ్బందికి ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో సిబ్బందితో కమిటీ సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన 3 మాతృ మరణాలు, 6 శిశు మరణాలకు గల కారణాలను విశ్లేషించాలని సూచించారు. మాతృ, శిశు మరణాల సంభవించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


