News November 20, 2024
VZM: ‘ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరి’

మరుగుదొడ్డి అనేది ఆత్మ గౌరవానికి చిహ్నమని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని, లేని వారికీ వెంటనే మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంలో భాగంగా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అంతటా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
Similar News
News October 16, 2025
VZM: ఆర్టీసీ సేవల్లో సమస్యలపై తెలయజేయండి

ఆర్టీసీ సేవల్లో సమస్యల తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ డీపీటీఓ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజారవాణాధికారిణి జి.వరలక్ష్మి తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫిర్యాదు స్వీకరించనున్నారు. విజయనగరం జిల్లా పరిధిలో గల ప్రయాణికులు, తమ సలహాలు, సూచనలు, సమస్యలపై 99592 25604 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.
News October 16, 2025
VZM: రైలులో గంజాయితో ఇద్దరు అరెస్టు

ఒడిశాలోని మునిగుడ నుంచి కేరళ తరలిస్తున్న మూడు కిలోల గంజాయి పట్టుకున్నట్ల రైల్వే ఎస్ఐ బాలాజీరావు చెప్పారు. పార్వతీపురం రైల్వే స్టేషన్ నుంచి విజయనగరం రైల్వే స్టేషన్ మధ్యలో ఏర్నాకులం రైలులో తనిఖీలు చేస్తుండగా కేరళకు చెందిన సుని, గోవిందరాజు నుంచి మూడు కిలోల గంజాయి సీజ్ చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. గంజాయి నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రైల్వే పోలీసులు చెప్పారు.
News October 15, 2025
విజయనగరం జిల్లా రైతులకు విజ్ఞప్తి

పత్తి, మొక్కజొన్న పంటలకు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించవద్దని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి రవికిరణ్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంవత్సరానికి పత్తి ధర క్వింటాల్కు రూ.8110, మొక్కజొన్న క్వింటాల్కు రూ.2400గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అక్టోబరు 21 తర్వాత జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.