News August 7, 2024
VZM: బొకారో ఎక్స్ ప్రెస్ దారి మళ్లింపు

చెన్నై సెంట్రల్-బేసిన్ బ్రిడ్జి స్టేషన్ల మధ్య వంతెన పునర్నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే బొకారో ఎక్స్‌ప్రెస్ దారి మళ్లిస్తున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. అలప్పుళ-ధన్‌బాద్ బొకారో ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 8,10,13, 15,17, 20,22, 24,27,29 తేదీల్లో రెగ్యులర్ మార్గంలో కాకుండా వయా పొదనూర్,ఇరుగూర్, సూరత్‌కల్ స్టేషన్ల మీదుగా నడుస్తుందన్నారు. పొదనూర్‌లో హాల్ట్ కల్పించామన్నారు.
Similar News
News April 14, 2026
VZM: రేపే ఇంటర్ ఫలితాలు.. 39,037 మంది విద్యార్థుల్లో ఉత్కంఠ

ఇంటర్ ఫలితాలు రేపు ఉ.10:30 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్‌లో 19,759 మంది, సెకండ్ ఇయర్‌లో 19,278 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఫలితాలను అందరికంటే ముందుగా, వేగంగా, సులభంగా Way2Newsలో చెక్ చేసుకోవచ్చు.
#Share It..
News April 14, 2026
VZM: 26 పరీక్షా కేంద్రాలు.. 8,053 మంది విద్యార్థులు

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2026) నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 25న జరిగే పరీక్షకు జిల్లాలో నుంచి 8,053 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.