News December 24, 2024

VZM: బ్రెయిన్ ట్యూమర్‌తో బాలుడు మృతి

image

ఆరేళ్ల బాలుడు బ్రెయిన్ ట్యూమర్‌తో మృతి చెందిన ఘటన కొత్తవలస మండలం రామలింగపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పిల్లల అప్పలరాజు, లక్ష్మీ దంపతులకు అకిరా నందన్, జైకృష్ణ ఇద్దరు కుమారులు. అఖిర్ నందన్‌(6)కు ఆదివారం వాంతులు కావడంతో మెరుగైన చికిత్సకు విశాఖపట్నం తరలించారు. చికిత్స అందించినప్పటికీ సోమవారం బాలుడు మృతి చెందాడు. తల్లిదండ్రులు గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.

Similar News

News November 20, 2025

భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు శిక్ష: DSP

image

విజయనగరం మహిళా పోలీసు స్టేషన్‌లో 2022లో నమోదైన వేధింపుల కేసులో నిందితుడు కలిశెట్టి వీరబాబుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించినట్లు DSP గోవిందరావు తెలిపారు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు మద్యం మత్తులో శారీరక, మానసిక వేధింపులు చేసిన భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. సాక్ష్యాలు రుజువుకావడంతో JFCM స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి. బుజ్జి శిక్ష ఖరారు చేశారని చెప్పారు.

News November 19, 2025

జిల్లాలో పర్యటించనున్న షెడ్యూల్డ్ కులాల కమీషన్: కలెక్టర్

image

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ జవహర్ ఆధ్వర్యంలో కమిటీ జిల్లాలో శుక్రవారం పర్యటించనుంది. కలెక్టర్ రాం సుందర్ రెడ్డి వివరాల ప్రకారం.. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌లో షెడ్యూల్డ్ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

News November 19, 2025

జిల్లాలో 2.27 లక్షల మంది రైతులకు లబ్ది: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అన్నారు. వేపాడ తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే లలిత కుమారి కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అధిక వర్షాలు నమోదవడం వల్ల జిల్లాలో వరి పంటకు మంచి దిగుబడి వచ్చిందని తెలిపారు. జిల్లాలో 2.27 లక్షల మంది రైతులకు రూ.150 కోట్లు జమచేశామన్నారు.