News August 31, 2024
VZM: ‘భారీ వర్షాలు.. యంత్రాంగం అలర్ట్’

వాయుగుండం కారణంగా రానున్న మూడు రోజులపాటు విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ నెం. 08922 236947 ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Similar News
News November 28, 2025
సదరం రీ-అసెస్మెంట్ జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

విజయనగరం జిల్లాలో NTR భరోసా పింఛన్ రీ-అసెస్మెంట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సదరం రీ-అసెస్మెంట్ కార్యక్రమంపై ఆయన శుక్రవారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రీ-అసెస్మెంట్లో జాప్యం జరుగుతుండటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News November 27, 2025
గంజాయి కేసులో ఐదుగురికి జైలు శిక్ష: VZM SP

డ్రగ్స్ కేసులో ఐదుగురు నిందితులకు 18 నెలల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి మీనాదేవి గురువారం తీర్పు వెలువరించారని విజయనగరం ఎస్పీ దామోదర్ తెలిపారు. విజయనగరంలోని వన్ టౌన్ పోలీస్స్టేషన్లో జూలై 26, 2024న పాత రైల్వే క్వార్టర్స్ వద్ద 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను సమర్పించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.
News November 27, 2025
VZM: బొత్స భద్రత లోపంపై విచారణకు ఆదేశం

పైడితల్లి సిరిమానోత్సవంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు కేటాయించిన వేదిక కూలిన ఘటనపై విచారణకు GAD ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా కలెక్టర్ను ఆదేశించారు. బొత్స ప్రొటోకాల్, భద్రతా లోపంపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని ఆదేశిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వేదిక కూలిన ఘటనలో MLC సురేష్ బాబు, ఎస్సై, మరో బాలికకు గాయాలైన సంగతి తెలిసిందే.


