News August 31, 2024
VZM: ‘భారీ వర్షాలు.. యంత్రాంగం అలర్ట్’

వాయుగుండం కారణంగా రానున్న మూడు రోజులపాటు విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ నెం. 08922 236947 ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Similar News
News February 14, 2025
VZM: గ్రూప్-2 పరీక్షకు 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

APPSC ఆధ్వర్యంలో ఈ నెల 23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. విజయనగరంలో మొత్తం 12 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశామని జేసీ సేతు మాధవన్ తెలిపారు. ఆ రోజు ఉదయం 10 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పటిష్ఠమైన పోలీసు బందోబస్తు నిర్వహించాలని జేసీ అధికారులను ఆదేశించారు.
News February 14, 2025
మంత్రి గన్‌మెన్ వెంకటరమణను సస్పెండ్ చేసిన ఎస్పీ

రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న జి.వెంకటరమణను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సస్పెండ్ చేశారు. వెంకటరమణ ఇటీవల సాలూరు నుంచి విజయనగరం వస్తుండగా బుల్లెట్ మ్యాగ్జైన్‌తో ఉన్న బ్యాగ్ మిస్ అయ్యింది. దీంతో ఆయన విజయనగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News February 14, 2025
విజయనగరంలో మంత్రి గన్ మెన్ బ్యాగ్ మిస్సింగ్

విజయనగరంలో మంత్రి సంధ్యారాణి వద్ద గన్ మెన్‌గా పనిచేస్తున్న ఏఆర్ హెచ్సీ వెంకటరమణ బ్యాగ్ మిస్సింగ్ కలకలం రేపింది. బుధవారం రాత్రి కణపాక వెళ్లే రహదారి వద్ద బ్యాగ్‌ను ఆటోలో పెట్టి జిరాక్స్ తీసేందుకు వెళ్లగా తన బ్యాగ్ మిస్ అయినట్లు వన్ టౌన్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో బుల్లెట్ మ్యాగ్జైన్, 30 బుల్లెట్లు మిస్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. CI శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నారు.