News March 22, 2024
VZM: భార్యపై కత్తితో దాడిచేసిన భర్త

భర్త భార్యను హతమార్చిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
జియ్యమ్మవలస మండలం సింగనాపురం గ్రామానికి చెందిన గంటా ముసలి నాయుడు భార్య అప్పలనరసమ్మపై కత్తితో దాడిచేయగా, ఆమె కడుపులో కత్తి దిగింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. ముసలి నాయుడు పరారిలో ఉండడంతో కేసు నమోదుచేసి, గాలింపు చర్యలు చేపట్టారు.
Similar News
News December 10, 2025
విజయనగరం: మా జీతాలు ఇవ్వండి సార్..!

విజయనగరం జిల్లాలో ఆర్ అండ్ బీ, జలవనరులు, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ సహా ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగస్థులకు 10వ తేదీ వచ్చినా కూడా ప్రభుత్వం జీతాలు వేయలేదని బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎల్వీ యుగంధర్‌ని ఏపీసిపిఎస్ఈఏ సభ్యులు కలిసి సమస్యను విన్నవించుకున్నారు. ఈ విషయంపై ఎస్టీఓ అమరావతి అధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు.
News December 10, 2025
VZM: దుకాణాల్లో పండగ ఆఫర్లు

క్రిస్మస్, సంక్రాంతి పంగల సందర్భంగా APCO ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిందని విజయనగరం మండల వాణిజ్య అధికారి RV మురళీ కృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై సాధారణ 40% తగ్గింపుతో పాటు అదనపు రాయితీలు కూడా ఉంటాయన్నారు. గంటస్తంభం, MG రోడ్డు, పూల్‌భాగ్, చీపురుపల్లిలో ఉన్న విక్రయ శాలల్లో లభిస్తాయన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ప్రోత్సహించాలన్నారు.
News December 10, 2025
VZM: ‘గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.84.62 కోట్లు మంజూరు’

జిల్లాలో గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.84.62 కోట్లు మంజూరయ్యాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. మొత్తం 67 పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందన్నారు. బొబ్బిలి-8, చీపురుపల్లి-10, గజపతినగరం-7, నెల్లిమర్ల-17, రాజాం-6, ఎస్.కోట-7, విజయనగరం-12 పనులకు ఆమోదం లభించిందన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఈ అనుమతులు వచ్చినట్లు వెల్లడించారు.


