News January 19, 2025
VZM: భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చిన్న శ్రీను

విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ మంత్రి మంత్రి ముత్తంశెట్టి రాజీనామాతో ఆ ప్లేస్‌ను భర్తీ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మజ్జి శ్రీనివాసరావు విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
Similar News
News October 14, 2025
VZM: ‘జిల్లా వ్యాప్తంగా 557 కేసులు’

శృంగవరపుకోటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 11 కేసులు నమోదు చేసినట్లు లీగల్ మెట్రాలజీ అధికారి బి.మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 557 కేసులు నమోదు చేసి, రూ.34.12 లక్షల జరిమానా, రూ.24.12 లక్షల రాజీ రుసుం వసూలు చేసినట్లు చెప్పారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక దాడులు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
News October 14, 2025
విజయనగరం: విధుల్లోకి చేరిన నూతన ఉపాధ్యాయులు

డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు విధుల్లో చేరడంతో పాఠశాలలు కళకళలాడుతున్నాయి. ఈ నియామకాలతో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీతో జిల్లాలోని 34 మండలాల్లో అన్ని మేనేజ్మెంట్లో 578 మంది కొత్త ఉపాధ్యాయలు పోస్టింగ్ పొందారని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు తెలిపారు. వీరంతా సోమవారం విధులకు హాజరయ్యారు.
News October 14, 2025
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయానికి 40 ఫిర్యాదులు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించగా, అందులో భూ తగాదాలు 8, కుటుంబ కలహాలు 5, మోసాలు 4, నగదు వ్యవహారం 1, ఇతర అంశాలు 22 ఉన్నాయని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫిర్యాదులపై 7 రోజుల్లో చర్యలు తీసుకుని నివేదికను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.