News June 12, 2024
VZM: మంత్రివర్గ సమావేశంలో కొండపల్లి

ఉండవల్లి లోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు పలు అంశాలపై తమతో చర్చించారని మంత్రి కొండపల్లి ఈ సందర్భంగా తెలిపారు. మంత్రిగా నిర్వహించాల్సిన బాధ్యతలపై చంద్రబాబు తమకి అవగాహన కల్పించారని మంత్రి తెలిపారు.
Similar News
News March 27, 2025
విజయనగరం జిల్లాపై సీఎం స్పెషల్ ఫోకస్

విజయనగరం జిల్లాలో సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ప్రధాన ప్రాజెక్టులైన తోటపల్లికి రూ.105కోట్లు, తారకరామసాగర్‌కు రూ.807కోట్లు ఇవ్వనున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో జిల్లాలోని సాగునీటి వనరులపై CM ఆరా తీశారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే సెంట్రల్ ట్రైబుల్ యునివర్సిటీకి రూ.29కోట్లు ఇస్తామన్నారు.
News March 27, 2025
VZM: ‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నాం’

ఖరీఫ్ 2024-25 సీజన్‌కు గాను జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున ఈనెల 31న కేంద్రాలను మూసి వేస్తున్నామని కలెక్టర్ అంబేడ్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 487 కేంద్రాల నుంచి 3.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతుల ఖాతాల్లో మద్దతు ధర రూ.768 కోట్లు, GLT చెల్లింపులకు రూ.12కోట్లు జమ చేశామన్నారు. రైతులు వద్ద ధాన్యం ఉంటే నిర్ణీత గడువులోగా విక్రయించాలన్నారు.
News March 27, 2025
VZM: పర్యాటక రంగంలో జిల్లా ఆదాయాన్ని పెంచుతాం: కలెక్టర్

విజయనగరం జిల్లాలో పైడితల్లి ఆలయంతో పాటు రామతీర్ధాన్ని పర్యాటక ఆధ్యాత్మిక క్షేత్రాలుగా అభివృద్ధి చేసి జిల్లాలో ఆదాయం పెంచుతామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. అమరావతిలో బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ అంశాన్ని ప్రస్థావించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తున్న దృష్ట్యా ఉపాధి అవకాశాలు, ఆతిధ్య రంగం అభివృద్ధిలో భాగంగా వాణిజ్యం, హోటళ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు.